ETV Bharat / state

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడిన ఆలయ ప్రాంతాలు - యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

Heavy rush in Yadadri: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులకు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కార్తిక మాసం, దానికితోడు సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా యాదాద్రికి తరలివచ్చారు.

Yadagiri Gutta Shri Lakshminarasimhaswamy
యాదగరి గుట్ట
author img

By

Published : Nov 6, 2022, 6:06 PM IST

Heavy rush in Yadadri: కార్తిక మాసం, ఆదివారం సెలవు దినాలు కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హరిహరులు కొలువైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి హైదరాబాద్​ సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

వాహనాల పార్కింగ్​ యాదగిరి కొండ దిగువన
వాహనాల పార్కింగ్​ యాదగిరి కొండ దిగువన

ప్రత్యేక, బ్రేక్​ దర్శనాలకు భక్తులు వరుస కట్టారు. ఉచిత దర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అలాగే బ్రేక్​ దర్శనం విభాగంలోనూ రద్దీ కనిపించింది. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కార్తికమాసం కావడంతో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణంలో 100కు పైగా జంటలు పాల్గొని, కొండ దిగువన మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు.

కార్తీకమాసం సందర్భంగా దీపాలు వెలిగిస్తోన్న మహిళలు
కార్తికమాసం సందర్భంగా దీపాలు వెలిగిస్తోన్న మహిళలు

మహిళలు కార్తికమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం చేసుకొని దీపారాధనలు చేశారు. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి దర్శించుకున్నారు. వేద పండితులు ఆమెను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

కుటుంబసమేతం స్వామివారిని దర్శించుకున్న రాధారాణి
కుటుంబసమేతం స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.