Yadadri Temple: యాదాద్రి ఆలయ రాజగోపురాలపై ఏర్పాటు చేసేందుకు చెన్నైలో సిద్ధం చేసిన స్వర్ణ కలశాలు యాదాద్రికి చేరుకున్నాయి. 'యాడా' రూపొందించిన ప్రణాళిక ఆధారంగా ఆలయం చుట్టూ నిర్మితమైన రాజగోపురాలపై, స్వర్ణ కలశాలు, రాగి కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టనున్నారు. ఆ క్రమంలోనే వాటిని చెన్నైలో సాంకేతిక కమిటీ పర్యవేక్షణలో రూపొందించారు.
రాజగోపురాలతో పాటు విమానంపై పొందుపరిచేందుకు కలశాలను తీసుకువచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్న ఈ సందర్భంలో తుది మెరుగులు దిద్దే పనులను 'యాడా' చేపడుతోంది.యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం ఏర్పాట్లలో భాగంగా ఆలయ సప్త రాజగోపురాలపై ప్రతిష్టించనున్న కలశాలను యాదాద్రి ప్రధానాలయానికి చేర్చారు.
ఇదీ చదవండి: