యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో చేనేత కార్మికుల చేపడుతున్న దీక్షకు మాజీ ఎంపీ ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. కరోనా మహమ్మరి విజృంభిస్తోన్న నాటి నుంచి చేనేత కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయన్నారు.
నేసిన బట్టలు అమ్ముడుపోక చేనేత ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని వాటిని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోనాలని ఆయన డిమాండ్ చేశారు. తాను రాష్ట్రం మొత్తం పర్యటించి చేనేత కార్మికుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని కేంద్రానికి తెలపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ హ్యాండ్లూం బోర్డు మాజీ సభ్యులు కర్నాటి ధనుంజేయులు , తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.