వారాంతంలో భక్తులతో కిటకిటలాడే యాదాద్రి క్షేత్రంలో కరోనా కారణంగా భక్తుల రద్దీ తగ్గింది. రోజూ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం వల్ల నిరంతరం సందడిగా ఉండే ఆలయ పరిసరాలు... నిర్మానుష్యంగా మారాయి. స్వామివారి దర్శన, లడ్డూ ప్రసాద క్యూలైన్లు భక్తులు లేక బోసిపోయాయి.
బాలాలయంలో రోజూ నిర్వహించే స్వామివారి నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొనే భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు యాదగిరిగుట్టలో స్వచ్ఛంద లాక్డౌన్ అమలులో ఉంది.
ఇదీ చదవండి: నీ అనురాగానికి వెలలేదు .... నీ ప్రేమకు హద్దులేదు..!