ETV Bharat / state

'తెరాస, కాంగ్రెస్​ కలిసి పోటీ చేయకపోయిన.. కమ్యూనిస్టుల మద్దతు భాజపాను ఓడించే వారికే'

author img

By

Published : Nov 6, 2022, 7:31 PM IST

CPI and CPM celebrated munugode bypoll victory: మునుగోడు ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపు ఎంతో రసవత్తరంగా సాగింది. అయితే చివరికి వామపక్షాలు, తెరాస బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం సాధించారు. ఈ విజయంతో సీపీఐ, సీపీఎం తమ రాష్ట్ర కార్యాలయాల్లో విజయోత్సవాలు నిర్వహించుకున్నాయి.

CPI and CPM celebrated munugode bypoll victory
సీపీఐ సీపీఎం

CPI and CPM celebrated munugode bypoll victory: మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి గెలుపొందడం తెలంగాణ రాజకీయాల్లో శుభపరిణామమని, ఈ ఫలితం అనేది ప్రజాస్వామ్య గెలుపుగా భావిస్తున్నామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్​లోని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యాలయాల్లో సంబురాలు జరుపుకున్నారు.

మునుగోడు ఎన్నికల్లో భాజపా ఓటమి రాజగోపాల్​రెడ్డికే కాకుండా మొత్తం భాజపాకు, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి చెంపపెట్టులాంటిది. మునుగోడు ప్రజలే ఇచ్చారు ఈ తీర్పును. భౌతికంగా, నైతికంగా, సాంకేతికంగా ఇది భాజపాకు మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు. రాష్ట్రంలో కాంగ్రెస్​, తెరాసకు మధ్యనే అసలు పోరు జరుగుతుంది రానున్న ఎన్నికల్లో.. అలాగే ఈ పార్టీలు అన్ని కలిసి ఒకవైపు ఉంటాయి ఎందుకంటే భాజపాను చిత్తుచిత్తుగా ఓడించడానికి. వామపక్షాలు భాజపా వ్యతిరేకంగా పోరాడతాయి. తెరాస, కాంగ్రెస్​ కలిసి పోటీ చేయకపోయిన సరే.. కమ్యూనిస్టుల మద్దతు భాజపాను ఓడించే వారికే ఉంటుంది. ఈవిజయం భాజపా వ్యతిరేఖ శక్తులని ఏకం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులు బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం తెలంగాణ రాజకీయాల్లో శుభ పరిణామం. మునుగోడు ఉప ఎన్నిక కుట్ర పూరితంగా తీసుకు రావడం జరిగింది. మునుగోడులో పాగా వేసి తెలంగాణలో అధికారంలోకి వస్తామనే సంకేతాన్ని ఇవ్వాలని భాజపా జాతీయ నాయకత్వం ప్లాన్ చేసింది. భాజపా కుట్ర భగ్నం అయ్యింది. ఈ విజయం తెరాస, కమ్యూనిస్టుల ఐక్యత ఫలితం. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో భాజపా అభ్యర్థుల ప్రభావం ఉంది కాబట్టే దుబ్బాక, హుజురాబాద్​లో భాజపా గెలుచింది. భాజపా బలంతో విజయం సాధించలేదు. భాజపాను కట్టడి చేసేందుకు ప్రజానీకం సిద్ధం కావాలని పిలుపునిస్తున్న. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

సీపీఐ పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.