ETV Bharat / state

చేనేత బతుకుల్లో కరోనా కలవరం - Weavers latest news

జీవితంలో మునుపెన్నడూ చూడని విపత్కరం . మనిషి జీవన చిత్రాన్నే పూర్తిగా మార్చేసిన ఆపదకాలం. ఉపాధిని ఊడ్చేసి... పేదల బతుకులను ఛిద్రం చేసిన దుస్థితి. ఇలా... అన్నిరంగాల్లో వీరంగం సృష్టించిన కరోనా మహమ్మారి.. చేనేత బతుకులను కోలుకోలేని దెబ్బతీసింది. మగ్గానికి మనిషికి మధ్య పోగుబంధాన్ని తెంచేసి.. రేపు ఏంటో తెలియని పరిస్థితుల్లోకి నెట్టేసింది. సమస్త బంద్‌తో.. వాలిన మగ్గాలను, నేసిన చీరలను చూసుకుంటూ.. లాక్‌డౌన్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న నేతన్న ఇక్కట్లపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

corona effect on  Weavers in bhoodan pochampally in yadadri bhuvanagiri district
చేనేత బతుకుల్లో కరోనా కలవరం
author img

By

Published : Apr 29, 2020, 10:00 PM IST

చేనేత బతుకుల్లో కరోనా కలవరం

పట్టుచీర నేయలేక పట్టుతప్పింది. ఆసుయంత్రం ఊపిరి ఆగింది. మగ్గం మీదున్న చీర నోరెళ్లబెట్టింది. యాదాద్రి భువనగరి జిల్లా భూదాన్ పోచంపల్లి చేనేత రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడి నేతన్నల కుటుంబాలు నేసిన చీరలకు మంచి గిరాకీ ఉంటుంది. మార్చి 22కు ముందు అంతా సాఫీగానే సాగిన పోచంపల్లి నేతన్నల జీవితాలు... ఒక్కరోజులో పూర్తిగా మారిపోయాయి. జనతా కర్ఫ్యూకు మద్దతిస్తూ... మగ్గం మీదున్న చీరను తెల్లారితే పూర్తి చేసుకుందామని భావించారు. కానీ లాక్ డాన్ అమలు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో మగ్గాలకు తాత్కాలిక సెలవిచ్చి ఇళ్లకే పరిమితమయ్యారు.

నిండుకున్న బియ్యం, పప్పులు

ఇవాళ, రేపు అంటూ నెలరోజులకుపైగా గడిపారు. కానీ రోజులు గడిచే కొద్దీ... మగ్గం ఆడించిన చేతులు ఊరుకోవడం లేదు. నూలుచుట్టిన భుజాలు ముడుచుకోవటంలేదు. రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేసిన దేహం... ఖాళీగా ఉండేందుకు సహకరించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. చూస్తే ఇంట్లో బియ్యం, పప్పులు నిండుకున్నాయి. అప్పులోళ్లు ఏమైదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నేసిన చీరలను అమ్ముదామంటే దుకాణాలు బంద్. తెలిసినోళ్ల దగ్గరికి వెళ్తే అగ్గువకు ఇస్తావా అంటూ బేరాలు. ఇలా ఎన్నో కష్టనష్టాల మధ్య కాలం వెళ్లదీస్తున్నాయి పోచంపల్లిలోని నేతన్నల కుటుంబాలు.

దయనీయ పరిస్థితి

భూదాన్ పోచంపల్లిలో సుమారు 2వేల500 మగ్గాలున్నాయి. వాటిపై 3 వేల 500 చేనేత కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఒక్కో మగ్గం మీద నెలకు 7 చీరలు నేస్తారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ నెలరోజులుగా మొత్తం ఆగిపోవడంతో వాటిపై ఆధారపడిన నేత కార్మికుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం, 1500 రూపాయలతో ఆకలి తీర్చుకుంటోన్న ఈ కుటుంబాలు... వాలిన మగ్గాలు మళ్లీ పుంజుకుంటాయో లేదోనని బరువెక్కిన గుండెలతో బాధపడుతున్నారు..

చీరలు నేయడమే వీరి నిరంతర పని

కులవృత్తినే జీవనాధారం చేసుకొని మగ్గం నేస్తున్న ఎబ్బ వెంకటేశ్‌కు ఇటీవలే వెంకటేశ్‌కు గుండె ఆపరేషన్ జరిగింది. నెలకు 4 వేల రూపాయలు మందులకు ఖర్చవుతుంది. కుటుంబం గడవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చీరలు నేయడమే వీరి నిరంతర పని. ఈ క్రమంలో లాక్ డౌన్ తో ఒక్కసారి ఈ కుటుంబ పరిస్థితి చిన్నాభిన్నమైంది. మగ్గం ఆగిపోయి... నేసిన చీరలను ఎవరూ కొనకపోవడంతో ఆర్థికకష్టాలు మొదలైనట్లు నేతన్న కుటుంబం వాపోతోంది.

వైకల్యాన్ని ఎదిరించి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఇతని పేరు గొట్టిముక్కుల రమేష్. తల్లితండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో నేత వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాడు. 14 ఏళ్లుగా మగ్గం నేస్తున్న రమేష్ మూడేళ్ల కిందట రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. దాతల సహాయంతో కృత్తిమకాళ్లతోనే మగ్గం నేస్తూ చీరలు తయారుచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎప్పుడు కూడా తాను వికలాంగుడినని కలతచెందని రమేష్ కు... కరోనా వైరస్ నిజంగానే తన కుటుంబాన్ని అవిటివాళ్లను చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఉపాధి కరువు

ఇతని పేరు కొంక లక్ష్మినారాయణ. చేనేత వృత్తిలో 25 ఏళ్ల అనుభవం ఉన్న ఈయన... మగువలు మెచ్చిన ఎన్నో అందమైన చీరలను నేస్తాడు. రోజంతా కష్టపడి చీరలు నేస్తే వచ్చే ఆదాయంతో ఇంటి అవసరాలు తీరిపోయేవని, లాక్ డౌన్ పరిస్థితులు మునుపెన్నడూ చూడలేదని చెబుతున్నాడు.వారసత్వంగా వస్తోన్న చేనేత వృత్తిని నమ్ముకొని మాస్టర్ వీవర్‌గా జీవిస్తున్నాడు అంకం మురళి. తన నివాసంలో 40 మగ్గాలు ఏర్పాటు చేసుకొని దాదాపు 200 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా తనతోపాటు తన మగ్గాల్లో పనిచేసే 200 మందికి ఉపాధి కరువైందని, వారు నేసిన చీరలన్నీ పేరుకుపోయి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఇవీచూడండి: రోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.