జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు అకాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ... బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బీఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా మోత్కూరులో... ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించి.. తన ఆటాపాటలతో తెలుగురాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని బీఆర్ఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.