కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. హస్తం నేతలు, కార్యకర్తలు పోచంపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి, ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని హస్తం శ్రేణులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని.. వారికి మద్దతుగా పోరాడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ చేశారు.
ఇదీ చూడండి: రైతులకు నష్టం కలిగితే సహించేది లేదు: మంత్రి పువ్వాడ