యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతోందని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఆత్మకూరు, మోత్కూరు, అడ్డగుడూరు మండలాల్లో పర్యటించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. భువనగిరి జోన్లో 16 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది.. రెండు షిఫ్టులుగా 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు. నిత్యావసర సరుకులను ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యే తెచ్చుకోవాలని తెలిపారు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయ అనుబంధ దుకాణాలు, మెడికల్, అత్యావసర పనులకు అనుమతించామని చెప్పారు.
లాక్డౌన్ సమయంలో ప్రయాణిస్తున్న వారికి తమ పోలీసులు.. కరోనా, లాక్‌డౌన్‌పై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. జోన్ పరిధిలో 18 పోలీసు స్టేషన్లు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో మృతిచెందిన గర్భిణికి అంత్యక్రియలు