కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: మండలి ఛైర్మన్ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ