యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం, రఘునాథపురం గ్రామ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకుడు బీర్ల అయిలయ్య పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు తక్కువ చేయడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని దాని తక్షణమే నిబంధనల ప్రకారమే పనులు సాగించాలని కోరారు. లేనిపక్షంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు జడ్పీటీసీ డాక్టర్ కుడుదుల నగేశ్, స్థానిక రఘునాథపురం ఎంపీటీసీ బుడిగే రేణుక పెంటయ్య, టీపీసీసీ కార్యదర్శి అయోధ్య రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, వంచ వీరారెడ్డి వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం