ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం అన్ని వసతులతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలంలోని మోపిరాల, సింగారం, కాల్వపల్లి గ్రామాల్లో చేపడుతోన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
ఆత్మకూర్ మండలంలో మూడేళ్ల క్రితమే డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు అయినప్పటికీ.. స్థల సేకరణలో ఆలస్యం కారణంగానే నిర్మాణాలు చేపట్టలేదని ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి తెలిపారు. మొరిపిరాలలో 20. సింగారంలో 20, కాల్వపల్లి గ్రామంలో 10 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సామాజికంగా వెనుకబడిన వారు, పేదలు, వికలాంగులకు గృహ కేటాయింపులలో ప్రాధాన్యతను ఇస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'లక్ష అడుగులతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు'