ఆలేరు నియోజకవర్గంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రతి ఊర్లో నీళ్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు 120 నీళ్ల ప్లాంట్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. యాదాద్రి భువనగిరిజిల్లా తుర్కపల్లి మండలం మోతీరాం తండాలో బీర్ల ఫౌండేషన్ సహకారంతో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన నీళ్ల ప్లాంట్‌ను ప్రారంభించారు. ఫ్లోరైడ్ బారిన పడకుండా... నియోజకవర్గంలో అందరికీ తాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
అండగా ఉంటాం..
బడుగు బలహీన వర్గాలకు బీర్ల ఫౌండేషన్ అండగా ఉంటుందని బీర్ల అయిలయ్య హామీ ఇచ్చారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు బీర్ల ఫౌండేషన్ ఆర్థిక సాయం చేస్తుందని పేర్కొన్నారు.
గ్రామస్థుల స్పందన
బీర్ల అయిలయ్యకు మోతీరాం తండా గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన బీర్ల అయిలయ్యకు గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ బిచ్చునాయక్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: త్వరలోనే పెళ్లి... అంతలోనే మృత్యు ఒడికి వధువు