యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అనాథలుగా మారిన చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించి మరోసారి తన దాతృత్వాన్ని చాటారు ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు బీర్ల అయిలయ్య. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అప్పటి నుంచి..
యాదగిరిగుట్టకు చెందిన నందిని, రాజు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుకోకుండా అనారోగ్యం బారినపడిన నందిని చికిత్స పొందుతూ హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె భర్త ఆరోగ్యం సైతం క్షీణించింది. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించారు.
చిన్నారుల ఏడుపు..
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడం, తినడానికీ తిండి లేకపోవడంతో చేసేదేమీ లేక ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లలను పోషించలేని స్థితిలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చిన్నారులు ఏడుస్తూ ఉండడాన్ని గమనించిన స్థానికులు.. దాతలెవరైనా సహాయం చేయాలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఆదుకోవాలి..
విషయం తెలుసుకున్న ఆలేరు కాంగ్రెస్ నియోజవర్గ నాయకుడు బీర్ల అయిలయ్య స్పందించారు. చిన్నారులకు తనవంతు ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: దాతృత్వం: కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం