మహిళల ఆత్మరక్షణ కోసం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ.. మిషన్ సాహసి కార్యక్రమం నిర్వహించింది. కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు కళాశాలల నుంచి వందలాది మంది విద్యార్థినులు హజరై శిక్షణ మెలకువలు నేర్చుకున్నారు.
మహిళలకు నిత్య జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేసి యువతుల్లో ఆత్మస్థైర్యం నింపాలని పలువురు విద్యార్థినులు కోరారు.
ఇవీ చూడండి: మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి