రాష్ట్ర మహిళా పోలీసులు దేశానికే ఆదర్శంగా ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు పీటీసి కళాశాలలో మహిళా సివిల్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. పీటీసీ ప్రిన్సిపాల్ ఎస్పీ గంగారాం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
మామునూరు టీఎస్ఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో 292 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. సమాజంలో పోలీసుల పాత్ర గొప్పదని ప్రజల భాగస్వామ్యంతో నేరరహిత సమాజాన్ని నెలకొల్పే విధంగా విధులు నిర్వర్తించాలని ప్రమోద్‌కుమార్ సూచించారు. దేశంలో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న ఆయన విధుల పట్ల అంకితభావంతో ఉండాలని తెలిపారు.