ETV Bharat / state

Warangal Vignana Peetham submerged : నీట మునిగిన విజ్ఞాన పీఠం.. వరదపాలైన విలువైన సంపద

Warangal Vignana Peetham submerged : జులైలో కురిసిన భారీ వర్షాలకు ప్రాణనష్టమే కాదు వెలకట్టలేని విలువైన సంపద సైతం వరదల పాలైంది. దానికి ప్రతిరూపమే వరంగల్‌లో ఉన్న గిరిజన సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబించే విజ్ఞాన పీఠం. తెలుగు రాష్ట్రాల్లో కొండ కోనల్లో తిరిగే గిరిపుత్రులనుంచి, జానపద కళాకారులనుంచి ఎన్నో విలువైన వస్తువులు, కళాకృతులతో కొలువుదీరిన మ్యూజియం ఇప్పుడు నీట మునిగింది. అపురూపమైన ఆకృతులకు నెలవైన ఈ పీఠం ......వరదల అనంతరం కళా విహీనంగా మారిపోయింది.

Vignana Peetham submerged in water in Warangal

author img

By

Published : Aug 7, 2023, 9:33 AM IST

Updated : Aug 7, 2023, 9:46 AM IST

Vignana Peetham submerged in water in Warangal నీట మునిగిన విజ్ఞాన పీఠం

Vignana Peetham submerged in Warangal : గత వారంలో కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయ్. వాగులు, నాలాలు పొంగి ప్రవహించడంతో చారిత్రక నగరం మూడు రోజుల పాటు జలదిగ్భందనమైంది. ఇదే క్రమంలో వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠమూ నీట మునిగింది. ఇందులో ఉన్న సెక్యూరిటీ గార్డు ఇద్దరు సిబ్బంది అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణ నష్టం సంభవించలేదు కానీ వెలకట్టలేని విలువైన సంపద మాత్రం ఎందుకు కొరగాకుండా పోయింది. వరద ఉధృతికి విలువైన కళాఖండాల రూపురేఖలే మారిపోయాయి.

Warangal Heavy Floods 2023 : వరంగల్ జాన పద గిరిజన విజ్ఞాన పీఠంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక వస్తువులను, జానపద కళాకృతులను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేకరించి ప్రదర్శనగా పెట్టారు. కానీ ఏళ్ల తరబడి పడ్డ శ్రమంతా వరదపాలైంది. ఔజం, తుడం, కిద్ది, డమరుకం, డోలు, ఒగ్గుడోలు, తాంబుర్ర, చిడతలు, మద్దెల, తబల, ఇలా గిరిపుత్రులు ఉపయోగించే... ఎన్నో వస్తువులతోపాటు చిన్న గుంటుక, మోటగీర, దుంపనాగలి, బురద నాగలి, గొంగడి మొదలైన పనిముట్లు, అనేక వాద్య పరికరాలు నీట మునిగాయి.

Korutla Flood Problems 2023 : వరద గుప్పిట్లో కోరుట్ల.. దిక్కు తోచని స్థితిలో ప్రజలు

'' ఇంత భారీ ఎత్తున వర్షాలు కురవడం ఇదే మొదటి సారి. ఈ వర్షంలో జానపద గిరిజన విజ్ఞాన పీఠం నీట మునిగింది. ఎంతో కష్టపడి తెలుగు ప్రజల నుంచి ఎన్నో విలువైన సంస్కతికి సంబంధించిన అనేక వస్తువులు, జానపద కళాకృతులు సేకరించి పెట్టాం. అలాంటి వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. పత్రికలు, తాళపత్రాలు నీటిలో తడిసిపోయాయి. చాలా సంవత్సరాల నుంచి సేకరించిన వస్తువులు నీట మునగడం దురదృష్టకరం. మన ఆస్తి పాడైపోయిందనేంత బాధ పడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఏవైనా వస్తువులు చెడిపోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ ఇలాంటి వస్తువులు వెలకట్టలేనివి. కొన్నా వస్తువులకు అలాంటి రూపం రాదు. మన సంస్కతికి సంబంధించిన ఈ వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్లీ ఫీల్ట్​కు వెళ్లి వస్తువులను సేకరించి పెట్టాలి. ప్రస్తుతం ఈ పీఠానికి సరైన రహదారి కూడా లేదు. భద్రకాళీ బండ్ కు అనుసంధానంగా దీనిని అభివృద్ధి చేస్తే సందర్శకులకు ఉపయోగకరంగా ఉంటుంది.'' - డా.గడ్డం వెంకన్న, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, పీఠాధిపతి

warangal Floods 2023 : అంతే కాదు అడవి పుత్రులు ఇళ్లలో ఎక్కువుగా ఉపయోగించే రోకలిబండ, తెడ్డు, కొయ్యపీట, మేన, పల్లకి, సల్లకవ్వాలు, మొదలైన వస్తువులూ నీటిలో తడిసి నానిపోయాయి. అద్భుతమైన పెయింటింగ్స్, నగషీలు, ఆభరణాలు, విల్లంబులు మొదలైనవి కొన్ని కొట్టుకుపోగా మిగిలినవి చెల్లాచెదురయ్యాయి. గిరిపుత్రులు సంస్కృతిని తెలియచేసే ఆడియో వీడియో టేపులు పత్రికలు తాళపత్రాలు కూడా పాడైయ్యాయి. విలువైన ఈ వస్తువులను మళ్లీ సేకరించాలంటే మాటలు కాదు. అయినా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని పీఠం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Assembly Sessions 2023 : వరద నష్ట తీవ్రతపై అసెంబ్లీలో ప్రకటన.. ఏయే రంగాల్లో ఎంత నష్టం వాటిల్లిందంటే?

తిండి, నీరు లేక చైనా ప్రజల అవస్థలు.. ఇంకా వరదల్లోనే లక్షలాది మంది

Last Updated : Aug 7, 2023, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.