వరంగల్ అర్బన్ జిల్లాలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తున్నారు. రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఎల్కతుర్తి పీఎస్ పరిధిలో జాతీయ రహదారిపై.. ఏసీపీ రవీంద్ర వాహనాల తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా వచ్చే బండ్లను సీజ్ చేశారు. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లాక్డౌన్ మినహా.. మిగతా సమయాల్లో బయటకు వచ్చే వారు పోలీసు శాఖ వెబ్ సైట్ నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాలని ఏసీపీ సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: కరోనాతో వానరాలకు తిండి కరవు.. ఆకలి తీర్చిన సీఐ