ప్రియాంక అరెస్టుకు నిరసనగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్రాల స్థాయిలోనూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు గట్టిగా ఉన్నప్పుడే ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'నీటిని విడుదల చేసి పంటను కాపాడండి'