బల్దియా పరిధిలోని.. కోమటిపల్లి ప్రజలకు ఇక వీధి కుక్కల బెడద తీరనుంది. ఇటీవల కుక్కల స్వైరవిహారంపై ఈటీవీ భారత్, ఈటీవీ తెలంగాణ ప్రచురించిన కథనాలపై అధికారులు స్పందించారు.
యాంటీ బర్త్ కంట్రోల్ ద్వారా...
54 వ డివిజన్ పరిధిలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ.. గాయపరుస్తున్న పది వీధి కుక్కలను పట్టుకున్నట్లు బల్దియా ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడ్డి తెలిపారు. హసన్‌పర్తిలోని స్టెరిలైజేషన్ సెంటర్‌కు వాటిని తరలించి.. యాంటీ బర్త్ కంట్రోల్ (ఏ.బి.సి) శస్త్ర చికిత్స ద్వారా వాటిని నియంత్రించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:ఊరికి ఉపకారులు.. గ్రామాభివృద్ధికి గల్ఫ్‌వాసుల చేయూత