ETV Bharat / state

కళాశాలలో సంబురాలు...!

నిత్యం చదువులతో తీరిక లేకుండా ఉండే కళాశాల పండుగలకు నెలవైంది. విద్యాలయం కాస్తా... పల్లె రంగు పులుముకుంది. పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు దేశ సంప్రదాయ దుస్తులతో కనులవిందు చేశారు.

హోరెత్తించిన సంప్రదాయ ఉత్సవాలు..!
author img

By

Published : Feb 16, 2019, 10:26 PM IST

Updated : Feb 16, 2019, 11:44 PM IST

హోరెత్తించిన సంప్రదాయ ఉత్సవాలు..!
వరంగల్​లోని ఓ విద్యాసంస్థలో సంప్రదాయ సంబురాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ సంప్రదాయ దుస్తులను ధరించి విద్యార్థినీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. పల్లెతనం ఉట్టిపడేలా ఎడ్లబండ్లపై చిందులేస్తూ హంగామా చేశారు.
undefined

దేశంలోని పలు రాష్ట్రాల్లో చేసుకునే పండుగలను ఘనంగా జరుపుకున్నారు. అమ్మాయిలు నృత్యాలతో హోరెత్తించారు.
అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వేడుకలు ఉపయోగపడతాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
పాశ్చాత్య సంస్కృతివైపు పరుగులు పెడుతున్న యువతకు దేశ సంప్రదాయాలు, పండుగలను మరోసారి గుర్తు చేసేందుకు ఏటా... ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది.

Intro:TG_KRN_101_16_SANTHU LAL JAYANTHI_HAJARINA MLA _AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 280 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలలో స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు హోమ పూజ లో పాల్గొని, సంత్ సేవాలాల్ మహారాజ్ గారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మార్వో జగత్ సింగ్ గిరిజనుడు కావడంతో ఆయన గిరిజన భాషలో మాట్లాడడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని రానున్న రోజుల్లో ఒక ఎకరా స్థలంలో నిర్మించి రాష్ట్రంలోని ఒక ప్రత్యేక స్థానంలో ఆ ఆలయాన్ని ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని సన్మానించారు. అనంతరం జయంతి వేడుకలకు హాజరైన తండాల సర్పంచులకు ఎమ్మెల్యే సన్మానం చేశారు.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహణ
Last Updated : Feb 16, 2019, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.