ఆర్టీసీ యాజమాన్యం వరంగల్ నగరంలోని లోకల్ డిపో ఎదురుగా ఉన్న రెండెకరాల స్థలాన్ని ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థకు అప్పగించింది. వాణిజ్య ప్రాంతం కావడం వల్ల ఇక్కడ గజం విలువ 50 వేల రూపాయల పైనే పలుకుతోంది. ఆ లెక్కన ఈ భూమి ధర 5 కోట్లకు పైగా ఉంది. ఇంత ధర ఉన్న భూమి తక్కువ ధరకు లీజుకు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే వరంగల్ హంటర్‌రోడ్డులోని ఆర్టీసీ టైరీ ట్రేడింగ్ వర్క్‌షాపు నాలుగు ఎకరాలను గతంలో తెరాస ఎంపీ దయాకర్‌కు చెందిన రోనీ భారత్ కంపెనీకి లీజుకిచ్చారు. సంస్థ నష్టాల్లో ఉండగా తక్కువ ధరకు లీజు ఇవ్వడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆర్టీసీ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్!