వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : నేడు రాజీవ్‌గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి