అభ్యర్థుల ఎత్తు, 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. తమ లక్ష్యాన్ని సాధించడం కోసం కఠోరంగా శ్రమిస్తున్నామని అభ్యర్థులు తెలిపారు. కచ్చితంగా పోలీసు ఉద్యోగాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పోలీస్ ఉద్యోగమే లక్ష్యం
ఖాకీ చొక్కా ధరించాలనేది వారి కల... పోలీసు ఉద్యోగం సాధించడమే వారి లక్ష్యం. కలలను సాకారం చేసుకోవడం కోసం కఠోరంగా శ్రమిస్తున్నారు వరంగల్ జిల్లా అమ్మాయిలు.
పోలీసు ఉద్యోగం సాధిస్తామని ధీమా
హన్మకొండలోని జేఎన్‌ఎస్ మైదానంలో మహిళా పోలీసు అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి.వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జేఎన్‌ఎస్ మైదానంలో మహిళా పోలీసు అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎంపిక పరీక్షలకు వచ్చిన 1200 మంది మహిళా అభ్యర్థులతో మైదానం నిండిపోయింది. నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
అభ్యర్థుల ఎత్తు, 100 మీటర్ల పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. తమ లక్ష్యాన్ని సాధించడం కోసం కఠోరంగా శ్రమిస్తున్నామని అభ్యర్థులు తెలిపారు. కచ్చితంగా పోలీసు ఉద్యోగాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Last Updated : Feb 16, 2019, 12:46 PM IST