ETV Bharat / state

ఓరుగల్లులో మొదలైన నామినేషన్ల పర్వం

వరంగల్‌ బల్దియా ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. హోరాహోరీ పోటీతో వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.

gwmc elections
వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికలు
author img

By

Published : Apr 16, 2021, 3:27 PM IST

వరంగల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బల్దియా పరిధిలోని 66 డివిజన్లలో నామినేషన్ వేసేందుకు ఎల్బీ కళాశాలతో పాటు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. టికెట్‌ కోసం ముఖ్య కార్యకర్తలు తమ తమ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొంత మంది కచ్చితంగా తమకే టిక్కెట్ వస్తుందనే ఆశతో నామినేషన్ వేసేందుకు పత్రాలను తీసుకెళ్తున్నారు.

తెరాస, కాంగ్రెస్, భాజపా, వామపక్ష, స్వతంత్రులతో పాటు జనసేన పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ పుష్ప నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు.

ఇదీ చదవండి: సాగర్​ పోలింగ్​కు ఏర్పాట్లు.. పక్కాగా కొవిడ్​ నిబంధనల అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.