ఈనెల 7 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ హన్మకొండలోని తన కార్యాలయంలో కరోనా టెస్టు చేయించుకున్నారు. కొవిడ్- 19 టెస్టు అనంతరం చీఫ్ విప్ కు కరోనా నెగిటివ్ గా వైద్యులు నిర్ధరించారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా తన సిబ్బందితో కలిసి బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనా టెస్టులు చేయించుకున్నారు.
కొవిడ్- 19 టెస్టుల్లో తన సిబ్బంది అందరికీ కరోనా నెగటివ్ వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అదే విధంగా కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో తన సిబ్బందితో కలిసి కరోనా టెస్ట్ చేయించుకున్నాన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉంటూ నిబంధనలను పాటించాలన్నారు.