ETV Bharat / state

ఓరుగల్లును​ ఫ్యూచర్​ సిటీగా మార్చేందుకు కృషి: ఎర్రబెల్లి - warangal urban district latest news

వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్​ కళాశాల మైదానంలో వాకింగ్​ ట్రాక్​కు ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్​తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు శంకుస్థాపన చేశారు. ఓరుగల్లును​ ఫ్యూచర్​ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

Minister Errabelli ,  chief whip Vinay Bhaskar
ఓరుగల్లును​ ఫ్యూచర్​ సిటీగా మార్చేందుకు కృషి: ఎర్రబెల్లి
author img

By

Published : Apr 14, 2021, 12:07 PM IST

కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్​నెస్​ పట్ల ఆసక్తి బాగా పెరిగిందని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వరంగల్​లో పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం వరంగల్​ మహానగరంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హన్మకొండలోని ఆర్ట్స్​ కళాశాల మైదానంలో వాకింగ్​ ట్రాక్​కు ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయభాస్కర్​తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఆర్ట్స్​ కళాశాల మైదానంలో వాకింగ్​ ట్రాక్​కు శంకుస్థాపన చేయడం.. సంతోషించదగ్గ విషయమని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల సహకారంతో వరంగల్​ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వం హైదరాబాద్​ని గ్లోబల్​ సిటీగా, వరంగల్​ను ఫ్యూచర్​ సిటీగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ... అభివృద్ధి, సంక్షేమాలను విజయవంతంగా ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.