కరోనా రెండో దశ ఉద్ధృతంగా కొనసాగుతుండటంతో వరంగల్ పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం పది దాటితే అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 టికెటింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హన్మకొండలోని పలు కాలనీల్లో పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 559 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
మాస్కు ధరించని 3254 మందికి జరిమానా విధించారు. లాక్డౌన్ సమయంలో అవసరం లేకుండా బయటకు రావొద్దని.. ఒకవేళ బయటకు వచ్చి పోలీసులకు చిక్కితే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. నగరవాసులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : 'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'