పీవీ సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జయంతి వేడుకలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పీవీ నరసింహారావు 98వ జయంతి పురస్కరించుకొని హన్మకొండలోని ఆయన విగ్రహానికి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష అని కడియం శ్రీహరి కొనియాడారు. ఆయన అపర చాణక్యుడని.. తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని ప్రసంశించారు. ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని కడియం తెలిపారు.
ఇవీ చూడండి: పార్టీ కష్టాల్లో ఉంటే హరీశ్ ఊపిరిపోశారు: కేసీఆర్