రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలనే పూజించి.. పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్ఆర్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి విగ్రహాల అమ్మకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక మండపాల్లో మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని సూచించారు. రసాయనలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతోందన్నారు.
ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి