ETV Bharat / state

'యోగాతో సంపూర్ణ ఆరోగ్యకర జీవితం సాధ్యం' - అంతర్జాతీయ యోగా దినోత్సవం-2020

ఆరోగ్యమైన జీవితానికి యోగా చాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని... హన్మకొండలోని క్యాంప్ ఆఫీసులో ఆయన యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.

A Complete Healthy life should be done with Yoga said by chief whip vinayBhaskar
'యోగాతో సంపూర్ణ ఆరోగ్యకర జీవితం సాధ్యం'
author img

By

Published : Jun 21, 2020, 11:51 AM IST

'యోగాతో సంపూర్ణ ఆరోగ్యకర జీవితం సాధ్యం'

యోగాసనాలు ఆరోగ్యకర జీవితానికి ఎంతగానో తోడ్పడుతాయని... శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని... హన్మకొండలోని క్యాంప్ ఆఫీసులో ఆయన యోగాసనాలు వేశారు. యోగా వల్ల మెదడుకు, మానవ దేహంలోని అవయవాలకు సమన్వయం పెరిగి... సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. కరోనా వైరస్ దరిచేరకుండా ప్రతి కుటుంబం ఇంట్లోనే ఉండి యోగా చేసుకోవాలని సూచించారు. యోగాతో మానసిక, శారీరక ధృడత్వాన్ని సాధించవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి : 'యోగాతో రోగ నిరోధన శక్తి.. ఆసనాలు వేసిన మంత్రి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.