90 ఏళ్ల వయసులోనూ ఈయన రోజూ సైకిల్‌పై హన్మకొండ, కాజీపేట, వరంగల్ నగరాల్లోని పలు ప్రాంతాల్లో(సుమారు 40 కి.మీ. దూరం) తిరుగుతూ సిరిసిల్ల చేనేత వస్త్రాలు అమ్ముతూ జీవన పోరాటం చేస్తుండటం.
‘‘భార్య అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు యుక్త వయసులోనే కన్నుమూశారు. చిన్న కుమారుడు స్థానికంగా చిన్న దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. కుమారుడిపై ఆధారపడటం ఇష్టం లేదు. అందుకే కష్టపడుతున్నా. స్వశక్తితో భార్యను పోషించుకుంటున్నా. కాళ్లు చేతులు సహకరించినంత కాలం ఇలాగే బతుకుతా’ అని ఆయన తెలిపారు. ఇరవై ఏళ్ల క్రితం వరకు జొన్నరొట్టె ఎక్కువగా తినేవాడినని, ఇప్పుడు రోజూ సద్ది అన్నం తింటున్నానని, మద్యం సహా ఇతర దురలవాట్లకు దూరంగా ఉంటున్నానని, అదే తన ఆరోగ్య రహస్యమని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: కరోనాపై మోదీ పోరుకు గ్రామీణ భారతం ఫిదా!