వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. 50 మంది కార్మికులు గ్రూపుగా ఏర్పడి ఒక్కొక్కరూ ఒక్కో వైపు పరిగెడుతూ... నానా తిప్పలు పెట్టారు. డిపో మేనేజర్‌కు వినతి పత్రాలు అందిస్తామని చెప్పి డిపోలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని ఆపడం పోలీసుల వల్ల కాలేదు. ఏసీపీ శ్రీనివాస్ రంగంలోకి దిగినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. చివరకు డిపో మేనేజర్‌నే బయటకు తీసుకవస్తానని సముదాయించి కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందిరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం