వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. పరకాలలోని వ్యవసాయ మార్కెట్ నుంచి ఆర్టీసీ డిపో వరకు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అమరధామంలో శివాజీ మహారాజ్‌కు నివాళులు అర్పించారు.
శివాజీ.. సామాన్య ప్రజానీకానికి యుద్ధ పాఠాలు నేర్పి.. హిందూ సామ్రాజ్యాన్ని నిర్మింపజేశారని అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి