వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో స్థానికుల సహాకారంతో ఆర్ఎస్ఎస్ సేవా భారతి విశిష్ట సేవలు అందిస్తుంది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి గ్రామీణ ప్రజలకు కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఉపాధి కోల్పోయిన నిరుపేద ప్రజలకు ప్రతినిధులు నిత్యావసర సరకులు, మాస్కులను పంపిణీ చేస్తున్నారు. కరోనా నియంత్రణలో ఆర్ఎస్ఎస్ సేవా భారతి సేవలను గ్రామస్థులు కొనియాడారు.
'ఆర్ఎస్ఎస్ సేవా భారతి సేవలు భేష్' - RSS Seva Bharati
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని ఆదుకోవటానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో వరంగల్ రూరల్ జిల్లా ఇల్లంద గ్రామంలోని పేదలకు ఆర్ఎస్ఎస్ సేవా భారతి ఆధర్వంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
!['ఆర్ఎస్ఎస్ సేవా భారతి సేవలు భేష్' RSS Seva Bharati Distributes Essential goods for poor peoples in Warangal rural district Wardhannapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7147207-933-7147207-1589169345011.jpg?imwidth=3840)
ఆర్ఎస్ఎస్ సేవా భారతి సేవలు భేష్