వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుండగా మినీ గూడ్స్ వ్యాన్ ఢీకొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: రూ.1800 కోసం కత్తులతో దాడి