కోనాయిమాకులలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ద్వారా నాలుగు మండలాలకు జలకళ సంతరించుకుంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. వరంగర్ రూరల్ జిల్లా పరకాల నియోజక వర్గం గీసుకొండ మండలంలోని కోనాయిమాకులలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించామని గుర్తు చేశారు. ఇంకా భూసేకరణ చేయాల్సిన భూములను వెంటనే సర్వే చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పంప్‌హౌజ్ పనులు పూర్తి కావచ్చాయని, ఏది ఏమైనా రబీ సాగుకు రైతులకు నీరు అందిస్తామన్నారు. ప్రాజెక్ట్ అనుసంధానంగా ఉన్న చెరువులు, కుంటలు, పిల్ల కాలువలను నింపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూ సేకరణకు సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన భూసేకరణకు కూడా రైతులు సహకరించాలన్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు