వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ శాసనసభలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ కోరడం అర్ధంలేని డిమాండ్ అని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం కొండపాకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రైతు వేదికను ప్రారంభించారు.
10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మంజూరు చేయిస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాగు చట్టాలతో రైతుల విశాల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అన్నదాతలను ఆదుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సాగు చట్టాలపై రాష్ట్ర రైతులు గళం విప్పాలని పిలుపునిచ్చారు.
- ఇదీ చూడండి: ఓరుగల్లులో ఎడ్లబండిపై మంత్రుల సందడి