వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం లాల్ తండాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఉరేసి బండరాయితో తలపై కొట్టిన ఆనవాళ్లను గమనించినట్లు పేర్కొన్నారు.
ఆ దిశగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుడు బాధవత్ వేరుగా పోలీసులు గుర్తించారు. నిందితులను తర్వగా పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.