ETV Bharat / state

Peddi sudarshan reddy: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ - తెలంగాణ వార్తలు

కరోనా కష్టకాలంలోనూ పేదలకు కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నర్సంపేట, ఖానాపురం మండలాలకు చెందిన 208 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
author img

By

Published : May 28, 2021, 1:55 PM IST

కరోనా కష్ట కాలంలోనూ కల్యాణలక్ష్మి చెక్కులను అందించి నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ను... నిండుమనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi sudarshan reddy) అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట, ఖానాపురం మండలాలకు చెందిన 208 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.

నర్సంపేట నియోజకవర్గంలోని 510 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. కరోనా కాలంలో ఎంత ఇబ్బంది ఉన్నా.. పేదలకు అందించే ఆసరా పింఛన్లను ముఖ్యమంత్రి ఆపకుండా అందిస్తున్నారని కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.