Inspirational Handicapped Story in Hanamkonda : పుట్టికతోనే వికలాంగురాలుగా పుట్టిన పాపను.. తల్లిదండ్రులు బాగానే చూసుకున్నారు. పాప పెద్ద వ్యక్తి అయ్యేటప్పటికి వారు వృద్ధులు అయ్యారు. దాంతో పాటు వారికి అనారోగ్యం పెద్ద సమస్యగా మారింది. తప్పని పరిస్థితిలో ఆమె పనిచెయ్యవలసి వస్తుంది. ఆమెకు తోటి బంధువులు ఉన్న వారి నుంచి వేరుగా ఉంటున్నారు. దీంతో తల్లిదండ్రుల బాధ్యత ఆమెపై పడింది. వారిని ఒంటరిగా వదిలేయకుండా.. ఆనందంగా చూసుకోవాలని అనుకుంది. రెండు కాళ్లు పనిచేయకపోయినా.. తల్లిదండ్రులను సంతోషంగా చూసేకోవాలనే తపనతో ఆమె పనిచేసేందుకు ముందడుగు వేసింది. కొంత కాలంగా పూల వ్యాపారం చేసింది. పూల ధర పెరిగిపోవడంతో ప్రస్తుతం రొయ్యలు, ఎండు చేపలు అమ్ముతూ.. జీవనం సాగిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచుతోంది. ఆమె ఒకరి సాయం తీసుకోకుండా.. కన్నోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ విధికి ఎదురీదుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన బైరి సాంబలక్ష్మి.
Woman is Working and supporting Her Parents : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన బైరి సాంబలక్ష్మికి పుట్టుకతోనే పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. తనకు అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు ఉన్నా.. వారంతా వేరుగా ఉంటుండగా.. తల్లిదండ్రులు, సాంబలక్ష్మి ఒకే చోట ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మానాన్న ఆలనాపాలనలో పెరిగిన సాంబలక్ష్మి.. తాను దివ్యాంగురాలైనా ఏనాడు కుంగిపోలేదు.
పగలు డెలివరీ బాయ్.. రాత్రి సెక్యూరిటీగార్డ్.. భిక్షాటన మానేసి కుటుంబాన్ని పోషిస్తున్న దివ్యాంగుడు
Handicapped Women Inspiration Story : కొన్నేళ్ల క్రితం వరకు పూలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేది. పూల ధరలు పెరగడంతో అప్పటి నుంచి రొయ్యలు, బొమ్మిడీలు, ఎండు చేపలు అమ్ముతోంది. ప్రభుత్వం తనకిచ్చిన ట్రైసైకిల్‌పై ఊరూవాడా తిరుగుతూ ఎండు చేపలు అమ్ముతోంది. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకోవటం పైగా వారు అనారోగ్యానికి గురవటంతో ఇంటి వద్దే ఉంటున్నారు. రెండు కాళ్లు పనిచేయకపోయినా.. రోజంతా కష్టపడి, అమ్మానాన్నను పోషిస్తున్న సాంబలక్ష్మి ఆత్మవిశ్వాసానికి ఎవరైనా సలాం చేయాల్సిందే. పేదరికంలో ఉన్న తనకు ఎవరైనా దాతలు సహకరిస్తే కిరాణ దుకాణం పెట్టుకుంటానని సాంబలక్ష్మి చెబుతోంది.
"నేను చిన్నప్పటి నుంచి వికలాంగురాలిని. మా గ్రామంలో రొయ్యలు, బొమ్మిడీలు, ఎండు చేపలు అమ్ముకుంటున్నాను. మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నా తల్లిదండ్రులు వృద్ధాప్యం వల్ల ఇంటిలోనే ఉంటున్నారు. వారిని నేనే కష్టపడి పోషించాల్సి వస్తుంది. ప్రతి రోజు పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. డబ్బులు ఉంటే ఇంటి దగ్గరే కిరాణ దుకాణం పెట్టుకుని, తల్లిదండ్రులను పోషించాలని అనుకుంటున్నాను. ఎవరైనా నగదు సాయం చేయాలని కోరుతున్నాను." - సాంబలక్ష్మి, దివ్యాంగురాలు
ఇవీ చదవండి :