Narsampet Government Degree College : వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 1984లో షిఫ్టు పద్ధతిలో ఏర్పాటైన.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయంప్రతిపత్తి హోదా పొందింది. గ్రామీణ ప్రాంత నేపథ్యం కలిగిన డిగ్రీ కళాశాలల్లో స్వయంప్రతిపత్తి హోదా పొందిన మొదటి కళాశాలగా నిలిచింది. నాలుగు దశాబ్దాలలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఈ కాలేజీ సొంతం.
ఈ కళాశాల విద్యార్థులు పలువురు ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడ్డారు. రాజకీయ రంగంలో కూడా మంచి స్థితికి ఎదిగిన వారున్నారు. నాడు ఆర్ట్స్ గ్రూపులతో.. గ్రామీణ నేపథ్యం కలిగిన నర్సంపేట ప్రాంత విద్యార్థుల శ్రేయస్సు కోసం.. అప్పటి ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 1984లో డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. సొంత భవనం లేకపోవడంతో ద్వారకపేట రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బీఏ, బీకాం గ్రూపులతో మొదలైన కళాశాల షిఫ్టు పద్ధతిలో తరగతులను నిర్వహించేవారు.
Degree Internship: ఇక నుంచి చదువుకుంటూనే.. నెలకు రూ.10వేలు సంపాదించొచ్చు
ఈ క్రమంలోనే 1994లో రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత.. 1999లో వల్లభ్‌నగర్‌లో 18 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి పక్కా భవనం నిర్మించారు. ఇందులో భాగంగానే బీఎస్సీ గ్రూపులను ప్రారంభించడంతో డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టింది. 40 ఏళ్లల్లో కొన్ని సమస్యలెదురైనా కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఒక్కొక్కటిగా అధిగమిస్తూ కళాశాలను అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు.
మరోవైపు 2016లో పీర్ బృందం అధికారులు డిగ్రీ కళాశాలను సందర్శించి.. మౌళిక సదుపాయాలు, ఇతరత్రా అంశాలను పరిశీలించి న్యాక్ సీ గ్రేడ్ ఇచ్చారు. అప్పటి ప్రిన్సిపల్ చంద్రమౌళి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో కళాశాల అభివృద్ధి చెందింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో అధ్యాపకులు వేసవి సెలవుల్లో గ్రామాల్లో తిరిగి విద్యార్థులను చేర్పించడం పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడంతో 2022 మేలో పీర్ కమిటీ అధికారుల బృందం న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చింది.
First Autonomous Degree College In Telangana : ఈ క్రమంలోనే అటానమస్ కోసం ప్రిన్సిపల్, అధ్యాపకులు ధరఖాస్తు చేయడం జరిగింది. యూజీసీ అధికారులు గత ఏప్రిల్ 28,29న కళాశాలను సందర్శించి.. మే 31న స్వయం ప్రతిపత్తి హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రపంచ పోటీని ఎదుర్కొనే సామర్ధ్యం పెంచుకునే అవకాశం కలుగుతోందని ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. సొంతంగా ఉద్యోగ, ఉపాధి ఓరియంటేషన్ కోర్సులు ప్రవేశ పెట్టే వీలుంటుందని చెప్పారు. కంప్యూటర్ సైన్సు కోర్సులు ప్యూటర్ ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, మనటీవీ ల్యాబ్, వర్చువల్ వీడియో ప్రోగ్రామ్ ప్రత్యేక గదులు ఏర్పాటుచేయడం జరిగిందని వివరించారు. కళాశాలలో త్వరలోనే ఒపెన్ జిమ్, వర్కింగ్ ఉమెన్స్ హస్టల్ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్ రమేశ్ వెల్లడించారు.
"న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు రావడానికి పీర్ బృందం కళాశాలను సందర్శించింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇతరత్రా అంశాలను పరిశీలించింది. కళాశాలలో విద్య ఎలా ఉంది. అధ్యాపకుల పనితీరు ఎలా ఉంది. కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎంత. మొదలగు తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని న్యాక్ ఏ గ్రేడ్ ఇచ్చింది. మరోవైపు యూజీసీ అధికారులు స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు." - తోట రమేశ్, కళాశాల ప్రిన్సిపల్
ఇవీ చదవండి : DOST NOTIFICTION 2023-24 : దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై మాతృభాషలోనూ పరీక్షలు.. ఇంగ్లిష్ మీడియం అయినా..