ETV Bharat / state

నిరంతరం అప్రమత్తం - etv bharat interview with warangal districts collectors

కరోనా ప్రజలను బెంబేలెత్తిస్తోంది..వలస జీవులను కన్నీరు పెట్టిస్తోంది.. కార్మికులు, కర్షకులను కలవరపెడుతోంది.. జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు కీలకంగా మారారు.. మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు..? ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు..? పల్లెలు, పట్టణాలను మళ్లీ యథాస్థితికి చేర్చడానికి ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు..? ఇలా పలు అంశాలపై ఆరు జిల్లాల కలెక్టర్లతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

etv bharat interview with six warangal districts collectors on corona crisis and safety measures
నిరంతరం అప్రమత్తం
author img

By

Published : May 17, 2020, 9:30 AM IST

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు

1. వలస కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని తీసుకొచ్చే ప్రక్రియ ఎలా కొనసాగుతోంది?

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వస్తున్న వందలాది మందిని పరీక్షించాక హోం క్వారంటైన్‌కు పంపుతున్నాం. మన దగ్గరున్న వారు శ్రామిక్‌ రైళ్ల ద్వారా వెళ్తున్నారు.

2. చాలా మంది రూ. 1500 నగదు జమ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నారు?

బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల పోస్టాఫీసు ద్వారా అందజేస్తున్నాం. గత నెల 12వేల మంది ఫిర్యాదు చేస్తే 9వేల మందికి పైగా ఇచ్చాం. మిగతా వారికీ ఇస్తున్నాం.

3. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూడాల్సి వస్తోంది. దీని నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

కరీంనగర్‌లో 13 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మిల్లులను ట్యాగ్‌ఆన్‌ చేయడంతో ధాన్యం కొనుగోళ్లలో సమస్య తీరింది. మన వద్ద రా రైస్‌ మిల్లులనూ వాడుకుంటున్నాం.

4. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేందుకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు?

ప్రైవేటు ఆసుపత్రుల్లో వచ్చిన వారికి ప్రాథమిక థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి సేవలు అందించే అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతించాం.

5. జోన్ల వారీగా జిల్లాల్లో అనేక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇవి సక్రమంగా కొనసాగుతున్నాయా?

వైరస్‌ వ్యాప్తి కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఆరెంజ్‌ జోన్‌ అని లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చాక నిబంధనలు సడలిస్తాం.

జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ , అజీమ్‌

వలస కార్మికుల తరలింపు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని తీసుకు వచ్చే ప్రక్రియ అమలుకు అదనపు కలెక్టర్‌, డీఎల్‌పీఓను ప్రత్యేక అధికారులను నియమించాం.

రియల్‌ చెక్‌ నిర్వహిస్తున్నాం. ఖాతాల్లో నగదు జమ కాని వారి సమస్యను పరిష్కరించేందుకు డీఆర్డీవో, ఇతర అధికారులను నియమించాం.

ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా సీనియర్‌ అధికారులతో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాం.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఐఎంఏ, రెడ్‌క్రాస్‌ సమన్వయంతో టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రజలకు సూచనలు ఇప్పిస్తున్నాం.

జిల్లా సరిహద్దుల్లో 9 తనిఖీ కేంద్రాలున్నాయి. వైద్య ధ్రువపత్రాలు ఉన్న వారికే అనుమతి ఇస్తున్నాం. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తున్నాం.

- మహబూబాబాద్‌ కలెక్టర్‌ గౌతమ్‌

ఇప్పటి వరకు సుమారు 6వేల మంది కూలీలను వారి స్వస్థలాలకు పంపించాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 2వేల మందిని హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నాం.

సుమారు 14 వేల మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పరిష్కారానికి చర్యలు చేపట్టాం.

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు పంపిస్తున్నాం. 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు ఉత్పత్తి కాగా, వీటి తరలింపులో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 25 రోజుల్లో ఈ సమస్య సమసిపోతుంది.

వైద్య శాఖ సిబ్బంది, పర్యవేక్షకులతో ఆయా ఆసుపత్రుల నిర్వహణపై దృష్టి పెట్టాం.

గ్రీన్‌జోన్‌లో ఉన్నప్పటికీ వేరే రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, ఇతరులు వస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

ఇతర రాష్ట్రాల్లో ఉన్న జిల్లాకు చెందిన వలస కూలీలు తక్కువ సంఖ్యలో ఉన్నారు. సుమారు 200 మంది వరకు ఉండగా.. వారంతా వచ్చారు.

మూడు నెలల నుంచి రేషన్‌ తీసుకున్న వారికి డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తున్నాం.

3. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి చూడాల్సి వస్తోంది. దీని నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు

జిల్లాలో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 47 వేల మె.ట.లను కొనుగోలు చేశార. హమాలీల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు గుత్తేదారులతో మాట్లాడుతున్నాం.

జిల్లాలో ఎప్పుడూ ఓపీ సేవలకు ఆటంకం కలగలేదు. అన్నీ తెరిచే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు.

ఒక్క కరోనానే కాదు. డెంగీ, మలేరియా లాంటి వ్యాధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం.

- వరంగల్‌ గ్రామీణ కలెక్టర్‌ హరిత

జిల్లాకు వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దుల్లో ముద్ర వేస్తున్నాం. వారిని సీ్వీయ గృహ నిర్బంధంలో ఉంచుతున్నాం.

ఆధార్‌, బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉండాలి. లేని వారికి తపాలా కార్యాలయంలో నగదు చెల్లించాం. రానివారు రేషన్‌ షాపులు, తహసీీల్దార్‌ కార్యాలయంలో పరిశీలించుకోవచ్ఛు.

135 కేంద్రాలు ఏర్పాటు చేశాం. రోజూ 1500 నుంచి 2000 బస్తాల వరకు కొనుగోలు చేస్తున్నాం.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిరంతరం పని చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సేవలు అందుతున్నాయి.

ఇప్పటి వరకు జిల్లాలో కరోనా కేసులు లేకపోవడంతో గ్రీన్‌ జోన్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వినియోగించాలని సూచనలు ఇస్తున్నాం. కార్యాలయాల్లోనూ నిబంధనలు పాటించాలని ఆదేశించాం.

- జనగామ కలెక్టర్‌ నిఖిల

ఇప్పటివరకు కాకినాడ నుంచి కొందరు తమను తీసుకెళ్లాలంటూ చెప్పారు. వారిని ఓ వాహనం ఏర్పాటు చేసి తీసుకొచ్చాం. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారి నుంచి ఎలాంటి దరఖాస్తులు రాలేదు.

బ్యాంకులో ఆధార్‌ అనుసంధానం లేకపోవడంతో నగదు జమ కావడం లేదు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవాళ్లకు పోస్టాఫీసు ద్వారా నగదును అందించేలా అధికారులను ఆదేశించాం.

ప్రారంభంలో రైతులు ఒకేసారి అధిక సంఖ్యలో ధాన్యాన్ని తీసుకురావడంతో ఆలస్యమయింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి 140 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.

పూర్తి స్థాయిలో ఓపీలు ప్రారంభమయ్యాయి. వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

మాస్క్‌ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తున్నాం. శానిటైజింగ్‌ చేస్తూ నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.