వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ శ్రీనివాస్ 'సేవ్ కాన్సిటిట్యూషన్.. సేవ్ డెమోక్రసీ' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమని శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలను అడ్డుకునేందుకు తాము ప్రయత్నం చేస్తుంటే... పోలీసులు తమను అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దావు పరమేశ్వర్, పరకాల పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మచ్చ సుమన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మందా రామేశ్వర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి బాసాని.సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు