ETV Bharat / state

దొంగను పట్టించిన సీసీ కెమెరా - నల్లబెల్లి చెరువు కట్టపై వృద్ధురాలు మెడలో గొలుసు దొంగతనం

వర్ధన్నపేట మండలంలో ఈనెల 23న నల్లబెల్లి చెరువు కట్టపై ఓ వృద్ధురాలు మెడలో నుంచి రెండున్నర తులాల గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితున్ని వారం రోజుల్లోపే పట్టుకున్నారు.

cc camera that took the thief at wardhannapet
దొంగను పట్టించిన సీసీ కెమెరా
author img

By

Published : Feb 29, 2020, 6:53 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఈనెల 23న నల్లబెల్లి చెరువు కట్టపై ఓ వృద్ధురాలు మెడలో నుంచి రెండున్నర తులాల గొలుసును అగంతుకుడు దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బృందాలుగా ఏర్పడి నల్లబెల్లి, ఇల్లందా గ్రామాల్లోని సీసీ ఫుటేజ్​లను పరిశీలించారు.

ఆ పుటేజ్​ల ఆధారంగా బోల్ల రాజ్​కుమార్​ను నిందుతునిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, సెల్​ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగానే నిందితున్ని తొందరగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు.

దొంగను పట్టించిన సీసీ కెమెరా

ఇదీ చూడండి : డబుల్ బెడ్​రూం కోసం.. తెలంగాణ భవన్ వద్ద ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.