ETV Bharat / state

ఓరుగల్లులో వికసించిన బ్రహ్మ కమలం

వరంగల్ గ్రామీణ జిల్లాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హిమాలయాల్లో ఉండే బ్రహ్మకమలం ఓ గ్రామంలో విరబూసింది. ప్రతీ ఐదేళ్లకోసారి పూసే ఈ అరుదైన జాతి పుష్పం విరబూసిన ఘటన సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ఆవిష్కృతమైంది.

author img

By

Published : Aug 17, 2020, 11:54 AM IST

Brahma lotus  at warangal district
ఓరుగల్లులో వికసించిన బ్రహ్మ కమలం

వరంగల్ గ్రామీణ జిల్లా గవిచర్ల గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్​లోని తమ బంధువుల వద్ద నుంచి బ్రహ్మ కమలం మొక్కను తీసుకువచ్చి తన నివాసంలో నాటాడు. సరిగ్గా ఐదేళ్ల తరువాత రాత్రి పండు వెన్నెలలా విరబూయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. శివుడి ప్రతిరూపమని చెబుతూ కొబ్బరికాయలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు.

ఐదేళ్లకోసారి పూసే బ్రహ్మ కమలాన్ని చూసేందుకు గ్రామస్థులు పోటీ పడ్డారు. కమలాన్ని తాకి మనస్సులో కోరికలు కోరుకుంటే నెరవేరుతాయన్నది స్థానికుల విశ్వాసం.

చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.