వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మార్కెట్ ఛైర్మన్ చింతన్ సదానందం శిబిరాన్ని ప్రారంభించగా.. మేయర్ గుండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అగ్రిటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో రైతులు, రైతు సంబంధిత పరిశ్రమల ఉద్యోగులు, అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 300 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు. రక్తదానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడిన వారవుతారని వక్తలు వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి : 'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం'