మూగ జీవాల రోదన పాలకులకు పట్టదన్నట్లుగా మారింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పశు వైద్యశాల కోసం భవనం లేక.. అంగన్ వాడీ కేంద్రం కోసం నిర్మించిన భవనాన్ని వినియోగిస్తున్నారు. ఆ భవనంలో వసతులు లేక వైద్యం నిమిత్తం వచ్చే రైతులతో పాటు వైద్య సిబ్బంది కూడా అవస్థల పాలవుతున్నారు. రాయపర్తి మండలంలో 9 వేల గేదెలు, 10 వేల ఆవులు, 45 వేల గొర్రెలు ఉన్నాయి.
ఇవీ చూడండి: నేటి నుంచి తొలివిడత నామపత్రాల స్వీకరణ