లాక్డౌన్ కాలంలో మద్యం లేక ఇబ్బంది పడిన మందుబాబులు.. మద్యం విక్రయాల ప్రారంభించటంతో దుకాణాలకు క్యూ కట్టారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం, రాయపర్తి, వర్ధన్నపేటలోని మద్యం దుకాణాల ముందు ఉదయం నుంచే బారులు తీరారు. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణాల వద్ద పరిస్థితులను పోలీసు,అబ్కారీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు