వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మొజర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి సమీపంలోని స్నేహ చికెన్ కంపెనీలో పనిచేసే రాజేశ్, వంశీధర్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ద్విచక్రవాహనం మీద కొత్తకోట వెళ్లే క్రమంలో ఘటన జరిగినట్లు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వాహనదారుల వ్యక్తిగత తప్పిదం వల్లనే ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక అంచానాకు వచ్చారు. పూర్తి విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.